ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంది
1 min read
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నట్లు మహానంది మండల తాసిల్దార్ జనార్ధన్ శెట్టి పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించే వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు.
