NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎలక్షన్ కింగ్.. 227వ సారి పోటీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : తమిళనాడుకు చెందిన కే. పద్మరాజన్ ఎలక్షన్ కింగ్ గా సుపరిచితులు. ఫిబ్రవరి 19న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. పోటీకి సంబంధించి ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా.. అందరి కన్నా ముందే పద్మరాజన్ నామపత్రాలు దాఖలు చేశారు. అత్యధిక సార్లు పోటీ చేసిన పద్మరాజన్.. అత్యధిక సార్లు ఓడిపోయి కూడ రికార్డులకెక్కారు. 1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి పై లఖ్ నవ్ లో, పీవీ నరసింహరావు పై నంద్యాలలో పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్. నారాయణ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ పై పోటీ చేశారు.

About Author