NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐఎస్​ఎఫ్​ కమిటీ ఎన్నిక

1 min read

– AISF పాఠశాల అధ్యక్ష కార్యదర్శులుగా దేవరాజ్ రాజ్ కుమార్ ఎన్నిక 11 మంది విద్యార్థులతో పాఠశాల నూతన కమిటీ ఎన్నిక

– విద్యారంగా సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి….AISF

AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా AISF జిల్లా  ఉపాఅధ్యక్షుడు శ్రీరంగ మాట్లాడుతున్న_* అఖిల భారత విద్యార్థి సమాఖ్య  (AISF) ఉద్యమాలు పోరాటాలు గురించి విద్యార్థులకు వివరిస్తూ. సమరశీల విద్యార్థి ఉద్యమాల రథసారథి భారతదేశ విద్యార్థి లోకానికి స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించి  సంఘటిత శక్తిగా ముందుకు నడిపించే చోదకశక్తి అఖిల భారత విద్యార్థి సమైక్య (AISF) బ్రిటిష్ పరాయి పాలకుల బానిస చెర నుంచి మాతృభూమి విముక్తికై విరోచత స్వాతంత్ర ఉద్యమాలలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని చాటింది. భారతదేశ విద్యార్థి లోకాన్ని ఏకం చేసి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో పుట్టి పెరిగి అశేష త్యాగాలు చేసి సుదీర్ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) అని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అనంతరం విద్యార్థిని విద్యార్థుల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది అని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో AISF మండల ఉపాధ్యక్షుడు రాజేష్ AISF నూతన కమిటీ సభ్యులు ప్రదీప్ తరుణ్ కుమార్ వంశీకృష్ణ జస్వంత్ సురేష్ లక్ష్మీకాంత్ ఉరుకుంద లోకేష్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

About Author