చైర్మన్ గా అల్లాయ్ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ న్యూఢిల్లీ: న్యూఢిల్లీ కేంద్రంగా 22 దేశాల్లో 100 జిల్లాలతో 1600 క్లబ్ లతో 30 వేల మంది మెంబర్లతో ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న అంతర్జాతీయ సేవా సంస్థ అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ గా అల్లాయ్ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎన్నిక అయినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు . అంతర్జాలం ద్వారా జరిగిన సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు వి. ఎం రావు , బి. టి రాజులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో 2018-21 సంవత్సరాలకు గాను అసోసియేషన్ ఆఫ్ ఆలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గా జిల్లా 117 లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు 2021 వ సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా గవర్నర్- 2 అవార్డును పొందినట్లు తెలిపారు .కర్నూలు జిల్లాలో ఆలయన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ కర్నూల్ , ఆలయన్స్ క్లబ్ ఆఫ్ గాంధీ టవర్, అలయన్స్ క్లబ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అలయన్స్ క్లబ్ ఆఫ్ సేవా బంధు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత సంవత్సరం ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించామన్నారు.