సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చంద్రశేఖర్ ఎన్నిక
1 min readజిల్లా సమితి సభ్యులుగా సుభాషిని, నాగేశ్వరరావు, వెంకటరమణ, నానేపాటి ఎన్నిక
పల్లెవెలుగు వెబ్, కమలాపురం: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా 24వ మహాసభలు నెల 20 21 22 తేదీలలో ప్రొద్దుటూరులో జరిగిన మహాసభలలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా తిరిగి మూడోసారి పి చంద్రశేఖర్ ను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు జిల్లా సమితి సభ్యులుగా జి నాగేశ్వరరావు పి సుభాషిని పి నానేపాటి వై వెంకటరమణ లను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ కమలాపురంలో విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి గత 20 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడిగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శిగా సిపిఐ కమలాపురం ఏరియా కార్యదర్శిగా ఏఐటీయూసీ కమలాపురం ఏరియా కార్యదర్శిగా కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలోని పేద ప్రజలు అనగారిన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ అంచలంచలుగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఎదుగుతున్న నన్ను జిల్లా కార్యవర్గ సభ్యుడిగా తిరిగి ఎందుకు ఉన్నందుకు సిపిఐ రాష్ట్ర సమితికి జిల్లా సమితికి విప్లవ ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రశేఖర్ ది వీరపునాయుని పల్లి మండలం యు రాజుపాలెం గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నతనం నుండి కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు ఆ ఊర్లో జరిగే సందర్భంలో పాల్గొంటూ నాయకులు ఉపన్యాసాలతో ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ పోరాటంలో నిలబడి కమ్యూనిస్టు పార్టీ వారసత్వం నిలబెట్టేందుకు యు రాజుపాలెం లో జరిగిన పోలీసు కాలపుల్లో పోలీసు తూటాలకు ఎదురు నిలిచిన అమరజీవి కామ్రేడ్ లంపల వెంకటరామయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వివిధ స్థాయిల్లో పార్టీలో నిబద్ధతతో క్రమశిక్షణతో ఎదిగి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో నడుస్తున్నట్లు తెలిపారు.