NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీ రాజ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

1 min read

ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ఎన్నికలు..

ఎన్నికల పరిశీలకులుగా జి శ్రీధర్  రాజు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక జడ్పీ కార్యాలయములోని శనివారం ఏపీపీఆర్ఎంఈఏ  యూనియన్ బిల్డింగ్ నందు జరిగిన ఎన్నికలకు ఎన్నికల అధికారి కె. ప్రసన్న పాల్గొన్నారు.   ఏపీపీఆర్ఎంఈఏ జిల్లా సంఘం ఆధ్వర్యంలో  ఎన్నికల పరిశీలకునిగా  గొన్నురి శ్రీధర్ రాజు, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం  పరిషత్ యూనిట్, ఏలూరు (జడ్పీ యూనిట్) కో – ఆప్షన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగాయి.ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా పొనిపిరెడ్డి శ్రీనివాస్, సహాధ్యక్షులు కె. డేవిడ్ హనన్య ,ఉపాధ్యక్షులుగా కె.ఎస్.ఎన్.మళ్ళేశ్వరరావుజిల్లా కౌన్సిల్ మెంబర్స్ గా ఎం. అన్నపూర్ణ, జి. విజయ,ఎన్. రామకృష్ణ వర్మ, ఎన్నికయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం నకు ఏఓఎస్ పివివి ప్రకాష్, కె నరసింహమూర్తి, ఎన్ కనకదుర్గా కుమారి, ఇతర సంఘ సభ్యులు హాజరై, సమావేశ అనంతరము నూతన ఆఫీస్ బేరస్ లను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేసియున్నారు.

About Author