ఏపీ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక ఈరోజు జిల్లా కార్యాలయంలో నిర్వహించడమైనది. జిల్లా అధ్యక్షురాలుగా . కె.రాజగోపాలచార్యులు,జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీ పి అనిల్ కుమార్ జిల్లా ఆర్థిక కార్యదర్శిగా సిహెచ్ మణికంధరాచారి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ సంచాల శ్రీ బాలు సుబ్బారావు , టి.రమేష్ బాబు అపస్ గౌరవాధ్యక్షులు ఎన్నిక అధికారులుగా వ్యవహరించారు.అపస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ శ్రవణ్ కుమార్ రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ చక్రపాణి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రమౌళి తమ నివేదికను సమర్పించారు.ఆర్థిక కార్యదర్శి మన కంఠరాచారి తమ నివేదికను సమర్పించారు.రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధ్యాయ సమాజం ఒత్తిడిలో పనిచేస్తుందని స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచినప్పుడే ఉపాధ్యాయులు తమరు అంకితభావంతో పనిచేయగలరని తెలిపారు.అలాగే జాయింట్ స్టాప్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్లో గల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జిపిఎస్ అంగీకరించేది లేదని,నూతన పిఆర్సి నివేదిక ఆలస్యం అవుతుందని కావున ఐఆర్ వెంటనే ప్రకటించాలని డి ఎ బకాయిలు, ఇయల్ బకాయిలు, pf లోన్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధ్యక్షులు కేకే రాజగోపాల్ ఆచార్యులు మాట్లాడుతూ సంఘ నియమాలు అనుగుణంగా పని చేస్తూ సంఘ అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి జాతీయ భావాలను పెంపొందించుటకు వివిధ కార్యక్రమాలు రూపొందించాలని ఆ విధంగా కృషి చేస్తామని తెలిపారు.ప్రధాన కార్యదర్శి పి అనిల్ కుమార్ మాట్లాడుతూ సంఘ నియమాలకు అనుగుణంగా అంకితభావంతో పని చేస్తూ ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కారానికి త్వరలో పూర్తిస్థాయి కార్యచరణ రూపొందిస్తామని, అపస్ రాబోయే కాలంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల తమ కుటుంబ సభ్యులుగా భావించి, వారి సమస్యల పరిష్కారానికి సంక్షేమాన్ని కృషి చేయాలని కోరడమైనది. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలను బయోమెట్రిక్ అటెండెన్స్, ఇంటర్నెట్ సౌకర్యం పాఠశాలలో కల్పించాలని డిమాండ్ చేయడమైంది.ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ మాన్యులు బాలు సుబ్బారావు మాట్లాడుతూ మన కుటుంబం సంఘ వివిధ క్షేత్రాలు చాలా పెద్దవని మీ వెనకాల సంఘ అభివృద్ధికి దేశం క్షేమానికి అవసరమయ్యే కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 38 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు కార్యవర్గం,రాష్ట్ర బాధ్యులు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.