ఈ ఎన్నికల్లో స్వార్థపరులను సాగనంపాలి.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readచిత్తారివీధిలో టి.జి భరత్ భరోసా యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2024 ఎన్నికల్లో స్వార్థ పరులకు చరమగీతం పాడాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ ప్రజలకు పిలుపునిచ్చారు. 5వ వార్డులోని నిమిషాంబ దేవి ఆలయం వద్ద నుండి టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తారివీధిలో పర్యటించి 6 గ్యారెంటీ కరపత్రాలు ప్రజలకు అందించి మాట్లాడారు. వ్యక్తిగతంగా సంపాదించుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఈ నాయకులను ఇక నుండి నమ్మొద్దని ప్రజలకు చెప్పారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కర్నూలు అభివృద్ధి తప్ప తనకు మరొక ఉద్దేశం లేదన్నారు. నగర వాసులు ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించే బాధ్యత తాను తీసుకుంటానని భరత్ హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే యువకులంతా ముందుకొచ్చి తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. తాను గెలిచాక కర్నూలుకు కంపెనీలు తప్పకుండా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బాలు, చెన్నారెడ్డి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, లలితమ్మ, నరేష్, సురేష్, మంజుల, వి. లక్ష్మి, సుశీలమ్మ, నాగరాజు, హిదాయత్, హేమలత, షఫీ ఉల్లా, కళ్యాణి, ఎజాస్, ముక్తార్, నాగరాజు, హరిత, సికిందర్, వసుంధర, ఇంద్రజ, నరేష్, జనసేన పార్టీ జన సైనికులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్, కిరణ్, రాయలసీమ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.