NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైన్ షాప్ కోసం ఎన్నిక‌లు.. ఫ‌లితం ఏంటంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని బేగంపేట గురుమూర్తిలేన్‌ ప్రాంతంలో మాత్రం వైన్‌ షాప్‌ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్‌ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్‌లో వైన్‌షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ‘మీకు మీ ఏరియాలో వైన్‌ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్‌ ప్రక్రియ జరిపారు. 95.67 శాతం వద్దు అని ఓట్‌ చేయగా, 3.58 శాతం మంది ఎస్ అని ఓట్‌ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు.

                                 

About Author