NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో ఎన్నిక‌లు.. 7 స్థానాలు వైకాపా, 1 స్థానం టీడీపీ

1 min read

New Delhi / India - September 20, 2019: Ballot unit of the direct-recording electronic (DRE) voting machine used for Indian general elections, Election Commission of India

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏలూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇప్పటి వ‌ర‌కు వెల్లడైన ఫ‌లితాల్లో 7 వైసీపీ, 1 స్థానం టీడీపీ గెలుచుకున్నాయి. 2,33,38, 39, 41, 42, 48 డివిజ‌న్లలో వైసీపీ గెలుపొంద‌గా.. 37వ డివిజ‌న్ లో టీడీపీ గెలిచింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనూ వైసీపీ ఆధిక్యం ప్రద‌ర్శించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 15 పోల్ అవ్వగా.. అందులో వైకాపా కు 11 , తెదేపాకు 1, నోటాకు 1 ఓటు పోల‌య్యాయి. మ‌రో రెండు ఓట్లు చెల్లలేదు. సీఆర్ రెడ్డి క‌ళాశాల‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌ను జిల్లా క‌లెక్టర్ కార్తికేయ మిశ్రా ప‌రిశీలించారు. క‌ళాశాల‌లోని 4 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఒక్కో డివిజ‌న్ కు ఒక్కో టేబుల్ కేటాయించారు.

About Author