ప్రశాంతంగా ముగిసిన హమాలీ కార్మికుల ఎన్నికలు
1 min read– వంద శాతం పోలింగ్..
– కార్మిక సమస్యలపై అండగా ఉంటాం..
– నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: జిల్లా స్థానిక ఐ.ఎఫ్.టి.యు. అనుబంధ మార్కెట్ యార్డ్ కూరగాయల హమాలీ కార్మిక సంఘం ఎన్నికలు శనివారం ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రశాంతంగా జరిగాయి.ఇఫ్టూ నగర కమిటీ ఎన్నికలు నిర్వహించింది.ఈ ఎన్నికల్లో 68 కార్మికులకు ఓటుహక్కు కల్పిచారు.68 ఓటు వేశారు.100శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల ఫలితాలను ఐ.ఎఫ్.టి.యు.రాష్ట్ర కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు(యు.వి) ప్రకటించారు. ప్రెసిడెంట్ గా బాడితబోయిన వీరభద్రరావు, సెక్రటరీగా రంగాల నూకరాజు, కోశాధికారిగా చోడే సూరి, మేస్త్రి లు గా కట్టా వెంకటేష్, చంద్రగిరి బాలాజీ లు విజయం సాధించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ రహస్య బ్యాలెట్ పోలింగ్ జరిగింది.వెంటనే కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటించారు.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు,నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావులు మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు కార్మికుల కు అండగా ఉంటూ వారి తరుపున నీతి, నిజాయితీగా రాజ్యాంగ పరిధిలో పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ అధ్యక్షులు కాకర్ల శీను, ఇఫ్టూ నగర నాయకులు డి.వీరినాయుడు,మంగం అప్పారావు,పి.భూపతి,మంగరాజు రాము,గడసాల వెంకటరమణ,కోరాడ అప్పారావు,మట్టా తిరుపతిరావు,దన్నాన విజయ్, కాకర్ల శ్రీను,ఎన్.నెహ్రూబాబు, మీసాల రమణ తదితరులు పాల్గొన్నారు.