ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని, ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదురాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారని, ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. కరోనా పెరుగుతున్నందున ఆరోగ్యశాఖ అధికారులతోనూ సంప్రదింపులు జరిపినట్టు ఆయన వెల్లడించారు.