బుట్ట రేణుకను అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి
1 min readఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” సూచించారు. గురువారం పట్టణంలోని కుర్ణీ కళ్యాణ మండపంలో నందవరం మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, జేసీఎస్ కన్వీనర్లను పార్టీ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుకకు ఆయన పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” , అంతకు ముందు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీలకు కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొనడంతో అందుకు తాము అంగీకరించామన్నారు. ఆమె విజయానికి తాము కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో మళ్లీ వైఎస్సార్సీపీ విజయానికి ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో సమష్టిగా కృషి చేద్దామని ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక సూచించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు వేయాలని అడుగుదామన్నారు. చంద్రబాబు హయంలో పడిన ఇబ్బందులను, జగనన్న పాలనలో జరిగిన మంచి వివరించి పారదర్శక పాలనకు మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుదామన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు బుట్టా శివ నీలకంఠ , మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ కాంత్ రెడ్డి, ముగతి విరుపక్షి రెడ్డి, మండల నాయకులు, మండల జె సి ఎస్. కన్వీనర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.