NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్ విమానాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల‌క్ర్టిక్ విమానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 2026-2030 నాటికి విద్యుత్ తో న‌డిచే విమానాలు అందుబాటులోకి వ‌స్తాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన ఈజీ జెట్‌ వంటి విమానయాన సంస్థలు పెట్టుకున్న లక్ష్యం ఇది. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ స్వీడన్‌కు చెందిన ‘హార్ట్‌ ఏరోస్పేస్‌’ అనే స్టార్ట్‌పతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2026 నాటికి అమెరికాలోని పలు నగరాలకు ప్రయాణికులను చేరవేసేలా 100 విద్యుత్తు విమానాలను ఆ ఒప్పందం ద్వారా కొనుగోలు చేస్తోంది. బరువు తగ్గించడానికి ఈ విమానాల్లో సీట్లు కేవలం 19 మాత్రమే ఉంటాయి. ఈ విమానాలు గరిష్ఠంగా అంటే దాదాపుగా 400 కిలోమీటర్లు మాత్ర‌మే ప్రయాణికులను చేరవేస్తాయి.

                                          

About Author