ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పర్యావరణానికి, ఇతర సమస్యలకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర బడ్జెట్ లో కూడ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలిన ఘటన హైదరాబాద్ లోని చింతల్ లో జరిగింది. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల పై అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చింతల్, భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన రఫి కొంతకాలంగా ఎలక్ట్రిక్ స్కూటీ నడుపుతున్నాడు. ప్రతి రోజు రాత్రి పూట బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన స్నేహితుడు సాయికుమార్ ఇంట్లో చార్జీంగ్ పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బ్యాటరీ నుంచి పొగలు రావడం సాయి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన పక్క రూమ్‌లో స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లగానే బ్యాటరీ పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంట్లో సామానులు కొంత మేర దగ్ధమైనట్లు సమాచారం.