ఎలక్ట్రిక్ వాహనాలు పేలుడు.. బయటపడ్డ సంచలన నిజాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్‌డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్ కారణం కావొచ్చంటూ మొదట అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే కారణం అది కాదని డీఆర్‌డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది.