NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ వాహనాల వల్ల ప్రయాణ ఖర్చులు తక్కువ…

1 min read

ఎలక్ట్రిక్ దిశ గా ముందుకు నడిపించడం

హైదరాబాద్​, న్యూస్​ నేడు:  భారత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) వాడకం వేగంగా పెరుగుతోంది. సాంప్రదాయ వాహనాలతో పోలిస్తే స్పష్టమైన ఖర్చుప్రయోజనాలు కారణంగా ఇది కొనసాగుతోంది. మెదటిసారిగా విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఖర్చు కొద్దిగా ఎక్కువగా అనిపించినప్పటికీ… దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకుంటే, విద్యుత్వాహనాలు వల్ల ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఇప్పుడు ఎక్కువగా ఈ వాహనాలు కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో టాటా.ఈవీ ప్రముఖ పాత్ర పోషిస్తూ, విద్యుత్వాహనాలు మరియు సంప్రాదాయ వాహనాల మధ్య ధర సమతుల్యతనుతీసుకురావడంలో ముందంజలో ఉంది. తక్కువ ఖర్చుతో కూడిన వాహన నిర్వహణ, విద్యుత్ వాహనాలు భవిష్యత్తు ప్రయాణ మాధ్యమాలుగా మారి, కార్ల యాజమాన్య ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. వాహన్ డేటా ప్రకారం, విద్యుత్ ప్రయాణికుల వాహన విభాగంగణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో89,000 యూనిట్లకుపైగా రిటైల్ విక్రయాలు జరిగాయి. ఇది గత సంవత్సరంకంటే 22% వృద్ధిని సూచిస్తోంది. విద్యుత్ వాహన మార్కెట్ మొత్తం 19 లక్షలయూనిట్ల విక్రయాలను నమోదు చేసి, 27% వృద్ధిని సాధించింది. ఆర్థికప్రయోజనాలతో పాటు, తయారీదారులు మరియు ప్రభుత్వ పథకాల మద్దతుపెరగడం వల్ల కూడా వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

 విద్యుత్ వాహనాల ఆర్థిక ఆధిక్యం

విద్యుత్ వాహన యాజమాన్యానికి సంబంధించిన ఖర్చులను సమగ్రమైనదృష్టితో పరిశీలిస్తే, అనేక మార్గాలలో గణనీయమైన పొదుపులు కనిపిస్తాయి. బ్యాటరీ ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో, నెక్సాన్.ఈవీ వంటి మోడళ్ళమొత్తం కొనుగోలు ఖర్చు మరింత పోటీగా మారుతోంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, మరియు సిఎన్‌జి వాహనాలతో పోల్చితే నెక్సాన్.ఈవీ చాలాఅనుకూలంగా ఉంది. తద్వారా విద్యుత్ వాహనాలు మరింత విస్తృతవినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.

  దీర్ఘకాలిక నడపడం ఖర్చు లాభాలు:

నెక్సాన్.ఈవీ యొక్క వార్షిక నడపడం ఖర్చు ఇతర వాహన రకాలతో పోలిస్తేగణనీయంగా తక్కువగా ఉంటుంది. ఐదు సంవత్సరాలలో, ఈ తేడామరింత స్పష్టంగా కనిపిస్తుంది: నెక్సాన్.ఈవీ మొత్తం నడపడం ఖర్చు: ₹1,77,458, పెట్రోల్ వాహనం కోసం: ₹6,50,912, డీజిల్ వాహనం కోసం: ₹4,56,404, హైబ్రిడ్ వాహనం కోసం: ₹4,73,947, సిఎన్‌జి వాహనం కోసం: ₹3,78,625 ఈ దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనం వినియోగదారులకు సాంప్రదాయవాహనాలకు స్థిరమైన మరియు బడ్జెట్‌కు అనుకూలమైన ప్రత్యామ్నాయాన్నిఅందిస్తోంది.టాటా.ఈవీ భారతదేశ ఈవీ మార్కెట్‌ను 60 శాతం పైగా మార్కెట్ షేర్‌తోదూసుకుపోతోంది, నాలుగు సంవత్సరాలలో 2 లక్షల యూనిట్లకు పైగావిక్రయాలను సాధించింది. టాటా.ఈవీ భారతదేశంలో అతిపెద్ద విద్యుత్వాహన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది, ఇందులో టియాగో.ఈవీ, టిగోర్.ఈవీ,పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీ మరియు కర్వు,ఈవీ ఉన్నాయి, వీటి ధరలు ₹7.99లక్షల నుండి ₹22 లక్షల వరకు విస్తరించాయి.తదితరంగా, తన ఉత్పత్తులను సతతంగా నూతనంగా మలచుకుంటూమరియు మెరుగుపరుస్తూ, టాటా.ఈవీ వినియోగదారులకు విద్యుత్వాహనాలకు మారడం ఒక తెలివైన మరియు లాభదాయకమైన ఎంపికగామారుస్తోంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *