జగనన్న కాలనీలోని కరెంటు 5డిపి లను తొలగించాలి
1 min read– సిపిఐ ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి పట్టణ శివర్లలోని జగనన్న కాలనీలో 11 కెవి సామర్థ్యం కలిగిన కరెంట్ స్తభాలను, ఒకటే వీధిలో నిర్మాణ దిశలో వున్న ఐదు కరెంటు డిపి లను వెంటనే తొలగించాలని లబ్దిదారులు , సిపిఐ ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా సహకార కార్యదర్శి సూర్య ప్రతాప్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం జగనన్న కాలనీలోకి సిపిఐ వారిని పిలిపించి కాలనీలో ఒకటే వీధిలో ఐదు కరెంటు డీపీలు వేశారు ,ఇల్లు కట్టుకొని జీవనం చేసుకుందామంటే కరెంటు డిపి లతో లబ్దిదారులు భయాందోళనలకు గురవుతున్నామని సిపిఐ వారికి తెలిపారు. వారు ఐదు డిపి లను ఒకే వీధిలో ఎలా వేస్తారని పరిశీలించి ఈ కరెంటు డిపి లను వెంటనే తొలగించాలని వారు జగనన్న కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్యాపిలి పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ జగనన్న కాలనీలోని ఐదు కరెంటు డిపి లను తొలగించాలని తాహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ కి మెమరాండం అందజేశారు . ఆయన లబ్దిదారులతో సానుకూలంగా స్పందించి ట్రాన్స్కో ఎఇ వినోద్ కుమార్ కు చరవాణి ద్వారా కరెంటు డిపి ల విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ దిశలో ఉన్న కరెంటు డిపోలను వెంటనే నిలిపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆనంద్ కుమార్, కలచట్ల సిపిఐ నాయకులు రామచంద్రుడు, ఏఐఎస్ఎఫ్ సంజీవ నాయుడు, మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.