అంధకారంలో ఉన్న 4వ వార్డుకు విద్యుత్ ఏర్పాటు….
1 min read
విద్యుత్ సదుపాయాన్ని సమకూర్చిన ఎంపీపీ, సర్పంచ,కరెంట్ ఏఈ, వార్డు మెంబర్లు
హొళగుంద, న్యూస్ నేడు: మండల కేంద్రంలోని స్థానిక నాలుగవ వార్డులో విద్యుత్ సదుపాయం లేక రాత్రివేళలో అంధకారంగా ఉన్న కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సర్పంచ్ చలువాది రంగమ్మ, ఎంపీపీ నూర్జహాన్ బి, కరెంట్ ఏఈ మేడం వార్డు మెంబర్ హమీద్ లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే శనివారం వారు పంచాయతీ సిబ్బందితో కలిసి నాలుగో వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ సరఫరాను అందించేందుకు కొత్తగా తీగలను, మరియు విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటుచేసి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను తీర్చారు. ఎప్పటినుండో అంధకారంలో ఉన్న కాలనీకి విద్యుదీపాలను వెలిగేలా సహకరించిన సర్పంచ్ చలువది రంగమ్మ ఎంపీపీ నూర్జహాన్ బి కరెంటు ఏ ఈ మేడం కి పంచాయతీ సెక్రెటరీకి వార్డ్ మెంబర్ హమీద్లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.