PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టేళ్ల షెడ్డులో విద్యుదాఘాతం

1 min read

– షెడ్డు,20 పొట్టేళ్లు దహనం
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : గోనెగండ్ల మండలంలోని కున్నూరు గ్రామంలో రైతు ఏర్పాటు చేసుకున్న పొట్టేళ్ల షెడ్డులో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మంటలు సంభవించి 20 పొట్టేళ్లు అగ్నికి ఆహుతైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల తెలిపిన వివరాల మేరకు… కున్నూరు గ్రామానికి చెందిన చాకలి లింగన్న తనకున్న 5 ఎకరాల పొలంలో సుమారు రూ. 2 లక్షలు వెచ్చించి షెడ్డు ఏర్పాటు చేసుకొని పొట్టేళ్ల పెంపకం చేపట్టారు. పొట్టేళ్ల షెడ్డులో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించి మంటలు చెలరేగి 20 పొట్టేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే రైతు దాచుకున్న 10 వేరుశనగ బస్తాలు కూడా కాలిబూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్ అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను నియంత్రించే లోపు షెడ్డు, పొట్టేళ్లు పూర్తిగా కాలిపోయి రైతుకు తీరని నష్టం సంభవించింది. రైతు చాకలి లింగన్నకు సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

About Author