NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏనుగెక్కి.. ప్రగ‌తి భ‌వ‌న్ వెళ్తాం : ఆర్ఎస్పీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రజ‌లు కారు కింద ప‌డ‌తారో, ఏనుగెక్కి వెళ్తారో తేల్చుకోవాల‌ని రిటైర్డ్ ఐపీఎస్, బీఎస్పీ స‌మ‌న్వయ‌క‌ర్త ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. న‌ల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంక‌ల్ప స‌భ‌లో ఆయ‌న బీఎస్పీ లో చేరారు. అనంత‌రం బీఎస్పీ స‌మ‌న్వయక‌ర్త బాధ్యత‌లు అప్పగించారు. తెలంగాణ‌లో బ‌హుజ‌న రాజ్యం రాబోతోంద‌ని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. బ‌హుజ‌నులంత పాల‌కుల‌వ్వాల‌ని, ఏనుగెక్కి ప్రగ‌తి భ‌వ‌న్ వెళ్తామ‌ని చెప్పారు. ఎర్రకోట పై నీలి జెండా ఎగురుతుంద‌ని అన్నారు. రిజ‌ర్వేష‌న్లు బ‌ల‌హీన‌వ‌ర్గాల హ‌క్కని, పాల‌కుల భిక్ష కాద‌ని తెలిపారు. గురుకులాల ద్వార కేవ‌లం 4 ల‌క్షల మంది విద్యార్థులే చ‌దువుకుంటున్నారుని, 30 ల‌క్షల మంది విద్యార్థుల‌కు చ‌దువు బంద్ చేస్తే ఎలా ? అని ప్రశ్నించారు.

About Author