PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హతే – ప్రామాణికంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయం

1 min read

కుల,మత,వర్గ,బేధాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సామాజిక అభివృద్ధి చేసిన వైసిపి ప్రభుత్వం.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాజకీయ పదవులు…

ఆలూరు నియోజకవర్గములో “ఎన్నికలు దగ్గరపడేకొంది కొత్తబిచ్చగాళ్ల” వస్తుంటారు,ప్రజలు గమనించాలి

గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మాలగీత కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి పదివేలు ఆర్థిక సహాయం చేసిన మంత్రి గుమ్మనూరు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: అర్హతే ప్రామాణికం ప్రజా సంక్షేమే దేయ్యేమని కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మ నూరు జయరాం  పేర్కొన్నారు నియోజకవర్గం హోళగుంద మండలం లింగంపల్లి గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.సచివాలయానికి 20 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, కల్వర్ట్లు,సీసీ రోడ్లు డ్రైనేజీలు తదితర వాటికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ గ్రామానికి ఇప్పటివరకు 11 కోట్ల 25 లక్షలు నిధులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు, బూట్లు, నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కే సాధ్యమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలో కొత్తగా రాజకీయ భిక్షకాళ్ళు ప్రారంభం అయ్యారని వాళ్లని నమ్మొద్దని తెలిపారు.వాళ్ల కుల అభివృద్ధి కొరకు ఏనాడు కూడా పాటుపడని వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు. నియోజకవర్గంలో అందరికీ సమాన న్యాయం కల్పించి న్యాయం చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప, ఎంపీపీ తనయుడు ఈసా, సొసైటీ చైర్మన్ మల్లి, మండల కన్వీనర్ షఫీ ఉల్లా, ఎంపిటిసి రత్నమ్మ,సర్పంచ్ భర్త విరుపాక్షి రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి రామ్ భీమ్ నాయుడు,జిల్లా కమిటీ సభ్యుడు అయ్యలప్ప,గ్రామ నాయకులు భీమారెడ్డి, క్రిష్ణప్ప,సీతారామిరెడ్డి,యువ నాయకులు మౌనిష్, శంభులింగ,ఈశ్వర్, వైఎస్ఆర్పి తాలూకు నాయకులు ప్రకాష్ రెడ్డి, రామకృష్ణ, కుమార్ స్వామి ఆయా గ్రామ సర్పంచులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author