ఉపాధి హామీ పథకంలో అర్హులకు పని కల్పించాలి
1 min read– ఏపీడి బాలాజీ నాయక
పల్లెవెలుగు వెబ్ గిడివేముల: గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని మంగళవారం నాడుఉపాధికార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది తో సమావేశమైన ఏపీడి బాలాజీ నాయక్ ఆదేశించారు ఎంపీడీవో విజయ్ సింహ రెడ్డి ఏపీవో వెంకటరమణ హాజరయ్యారు ఈ సందర్భంగా చనిపోయిన ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డు వివరాలను తొలగించాలన్నారు అలాగే రెండు జాబ్ కార్డులు ఉన్న కూలీలను గుర్తించి ఒక జాబ్ కార్డును తొలగించాలని ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డును ఆధార్ తో లింకు చేయాలని అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వివరాలను నమోదు చేయాలన్నారు అన్ని గ్రామాలలో పని కల్పించాలని ఆదేశించారు.