NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 ఎల్లమ్మ గుడి వద్ద…బీటీ రోడ్డు వేయాలి:డివైఎఫ్ఐ

1 min read

పల్లెవెలుగు, పత్తికొండ: దేవనకొండ మండలంలోని కుంకునూరు గ్రామానికి దేవనకొండ టర్నింగ్ నుండి పాత రోడ్డు ఎల్లమ్మ గుడి రోడ్డు వెంటనే పునర్ నిర్మించి బిటి రోడ్డు వేయాలని అలాగే ప్రస్తుతం ఉన్న పాత రోడ్డుకు మరమ్మత్తుల చేపట్టాలని డీ వై ఎఫ్ ఐ డిమాండ్ చేసింది.  కుంకనూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడంతో మురుగునీరు రోడ్ల మీదే ప్రవహిస్తుందని, త్రాగునీటి పైపులు లీకేజీలు శుభ్రం చేసి మరమ్మత్తులు చేయాలని డివైఎఫ్ఐ నాయకులు కే శ్రీనివాసులు, చిన్న, వీరేంద్ర  కోరారు. గురువారం గ్రామమలో ఏర్పాటు చేసిన డివైఎఫ్ఐ సమావేశంలో వారు  మాట్లాడుతూ, వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చిన్నపాటి వర్షాలకి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయన్నారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉరుకుందు, సింహాద్రి,హరికృష్ణ రసూల్, మురళి, సుధాకర్, వీరేంద్ర, పాల్గొన్నారు.

About Author