ట్విట్టర్ కొనుగోలు పై వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్ !
1 min readపల్లెవెలుగువెబ్ : దిగ్గజ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలు విషయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా కార్ల కంపెనీ, స్పేస్‌ఎక్స్ ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధినేత ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. ట్విటర్ కొనుగోలు డీల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. స్పామ్/ఫేక్ ఖాతాల గురించి తాను అడిగిన సమాచారాన్ని ట్విటర్ బోర్డు అందజేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. ట్విటర్ కొనుగోలుకు సంబంధించి చేసుకున్న విలీన ఒప్పందానికి ఇది విరుద్ధమని ఆయన గుర్తుచేశారు. తన లక్ష్యాల్లో అత్యంత కీలకమైన ఫేక్/స్పామ్ ఖాతాల వివరాలను ఇచ్చేందుకు ట్విటర్ బోర్డు విముఖత వ్యక్తం చేస్తోందని మస్క్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.