పారిశుధ్య నిర్వహణకు రాష్ట్రంలో ఏలూరు జిల్లా ప్రధమస్థానం కైవసం
1 min readరాష్ట్రస్తాయిలో అభినందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి అన్ని జిల్లాలు అమలు చేయాలని ఆదేశాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరుగుతుందని రాష్ట్రస్తాయి టెలీకాన్ఫెరెన్స్ లో ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్ అధికారులు అప్రమతంగా ఉంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాష్ట్రస్తాయి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసి పారిశుధ్య నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో మురుగుకాలువలు నిర్వహణ, త్రాగునీరు ట్యాంకులు శుభ్రపర్చడం, పంచాయతీ చెరువులలో గుర్రపుడెక్క తొలగించడం, గ్రామాలలో చెత్తకుప్పలు లేకుండా చేయడం, పైప్ లైన్లు సరిచేసి స్వచ్ఛమైన త్రాగునీరు ప్రజలకు అందించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలకు పారిశుధ్య నిర్వహణపై ర్యాంకింగ్ ఇవ్వగా ఏలూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్తాయి వరకు పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ప్రభుత్వం పి.ఆర్ వన్ యాప్ అభివృద్ధి చేసింది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి పంచాయతీ సిబ్బంది ఫొటోస్ తీసి యాప్ లో అప్లోడ్ చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేసిన తర్వాత ఫొటోస్ ను తిరిగి యాప్ లో అప్లోడ్ చేయవల్సి ఉంటుంది. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ క్షేత్రస్థాయి తనిఖీలు, టెలీకాన్ఫెరెన్సస్ పెట్టి సిబ్బందిని అప్రమత్తం చేయడం, నిర్లక్యం వహిస్తున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించడం, సకాలంలో త్రాగునీటి పరీక్షలు, క్లోరినేషన్ చేయించడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా టైం లైన్ పెట్టి నిరంతర పర్యవేక్షణ చేయడం, పారిశుధ్య కార్మికుల నిస్వార్థ సేవలు, సిబ్బంది సహకారం వలన ఏలూరు జిల్లా పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో ఉందని తెలిసింది. దీనివలన గ్రామీణ ప్రాంత ప్రజలు దయేరియా, మలేరియా, డెంగీ, చికెన్ గునియా తదితర వ్యాధుల బారిన పడకుండా నివారిస్తున్న చర్యలు, ముఖ్యంగా జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించడానికి గ్రామాలలో ఉన్న ఓ.హెచ్.ఆర్ ట్యాంకు ప్రధాన వాల్వ్ ఛాంబర్స్ లో నిల్వ ఉన్న కలుషితమైన వర్షపు నీరుని తొలగించి త్రాగునీరు సరఫరా చేయడం పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షయించింది. సందర్బంగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఏలూరు జిల్లా చేపడుతున్న చర్యలని రాష్ట్రంలో అన్ని జిల్లాలు అమలు చెయ్యాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసారు. టెలీకాన్ఫెరెన్స్ లో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, కమీషనర్ కృష్ణ తేజ, అన్ని జిల్లాల జడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఆర్.డబ్ల్యూ.యస్ ఎస్.ఈలు పంచాయతీ రాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.