ఏలూరు నగర పర్యావరణ పరిరక్షణకు మౌలిక వసతులు
1 min read
పల్లెవెలుగు వెబ్,ఏలూరు: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ,అత్యాధునిక వసతులతో మేకల కబేలను అభివృద్ధి చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఏలూరు నగరంలోని పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృశ్య ప్రథమంగా శుక్రవారం స్థానిక తొమ్మిదో డివిజన్ లోని మేకల కబేలలో జరుగుతున్న పనులను పెదబాబు నగరపాలకసంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.కోటి వ్యయంతో మేకల కబేలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని,త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కబేల నుండి విడుదలయ్యే నీటి మరియు వ్యర్థాల నుండి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్, నగరపాలకసంస్థ డిఈ పి.కొండలరావు,ఏఈ యన్. రామారావు,కబేల పెద్దలు పాల్గొన్నారు.