NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నగర స్థాయి స్కూల్ చెస్ టోర్నమెంట్..

1 min read

విజేతలుగా విద్యార్థిని విద్యార్థులు..

చదరంగం ద్వారా 50 రకాల ప్రయోజనాలు..

తల్లిదండ్రులు పిల్లలను మరింత ప్రోత్సహించాలి..

అకాడమీ డైరెక్టర్ గంజి యోహన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : స్థానిక సత్రంపాడు లోని ఆదిత్య కిడ్స్ చెస్ క్లబ్ లో ఏలూరు నగర స్థాయి చెస్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెస్ అసోసియేషన్ ఆఫ్ హేలాపురి అధ్యక్షులు గంజి యోహాన్ హాజరై చదరంగం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు సుమారు 50 రకాల ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. అందరూ చెస్ నేర్చుకునే విధంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి దశ నుంచే వారి పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం అభ్యసించే పిల్లలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. అనంతరం గెలుపొందిన విజేతలు జి అభిషేక్ అవ్రహమ్ ప్రధమ, జి అనురూఫ్ మోషే ద్వితీయ, బాలికలు ఎస్ లేబోనా రాజ్ ప్రధమ, కె చోక్షిత తృతీయ బహుమతులు అందుకున్నట్లు అబ్రహం అండ్ గ్యారి సంస్థ అకాడమీ డైరెక్టర్ గంజి యోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆదిత్య చెస్ కిడ్స్ క్లబ్ డైరెక్టర్ వి రత్న కిషోర్, ప్రిన్సిపల్ వి శరణ్య, చెస్ కోచ్ శ్యామల, ప్రొఫెసర్ కిరణ్మయి, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author