NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు జిల్లా కలెక్టర్

1 min read

– ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు
పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామములొ వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునకు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఏలూరు జిల్లా కలెక్టర్ పి ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ కుటుంబ సమేతముగా విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం వీరిని ఆలయ ముఖమండపము నందు వేద ఆశీర్వచనము గావించినారు. అనంతరం వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించి ప్రసాదములు అందజేసినారు ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొన్నారు పాల్గొనినారు. ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీ మతి కీసరి సరిత విజయ భాస్కర రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author