బిజెపి జిల్లా కార్యాలయంలో ఏలూరు జిల్లా కోర్ కమిటీ సమావేశం..
1 min read– కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 18 రకాల చేతివృత్తుల పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలి..
– బిజెపి జిల్లా అధ్యక్షుడు సిహెచ్ విక్రమ్ కిషోర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం, లబ్ధిదారుల గుర్తింపు నిమిత్తం జిల్లా వ్యాప్తంగా అధికారులచే నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర కు సంబంధించి సమీక్ష మరియు ఈనెల 16వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నిర్వహించే బూత్ స్వశక్తీకరణ సమావేశం లో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జిల్లా పర్యటన కార్యచరణ గురించి చర్చించడం జరిగింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా 18 రకాల చేతి వృత్తుల వారికి స్టైపండుతో కూడిన శిక్షణ, ఉచిత టూల్ కిట్ మరియు ఆర్థిక సహాయం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రత్యేక ఆహ్వానితులు అంబికా కృష్ణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్నేని కృష్ణ ప్రసాద్, శరణాల మాలతీ రాణి ,ఐ చక్రవర్తి వర్మ , కే సుధాకర్ కృష్ణ , జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ , కట్టా సత్యనారాయణ, కోటపోలు కృష్ణ కన్వీనర్లు గాది రాంబాబు , వి.విష్ణు , ఒంటెద్దు యేసు వర ప్రసాద్ , కే రామకృష్ణ ,జి. రంగారావు తదితరులు పాల్గొన్నారు.