PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో వైసిపి క్యాడర్ సిద్ధం

1 min read

నియోజకవర్గంలో డివిజన్ల వారీగా క్యాడర్ తో మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమావేశాలు షురూ..

ఏలూరు కార్పొరేషన్ 40వ డివిజన్లో కార్పొరేటర్, క్లస్టర్-3 మహిళాధ్యక్షురాలు తుమరాడ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన వైసిపి కుటుంబాలతో ఆళ్ల నాని ఆత్మీయ సమావేశం..

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జగన్మోహన్ రెడ్డి పాలన ఇపుడు రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం – ఈ ఘట్టంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రత్యేక చొరవ చూపాలి – భావి తరాలకు ఒక గొప్ప సంక్షేమ పాలనను కొనసాగించడంలో   భాగం అయ్యం అని మనమంతా గర్వంగా చెప్పుకోగలంమని వైసిపి క్యాడర్ కు ఆళ్ల నాని దిశానిర్దేశం చేశారు.గతంలో వరద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 12పంపుల స్కూల్ లో ఆశ్రయం పొందే వాళ్ళం – కానీ ఆళ్ల నాని వల్ల ఈరోజు ప్రశాంతంగా బ్రతుకుతున్నాము – మీ లాంటి నాయకుడిని గెలిపించుకోవటం మా కర్తవ్యం: స్థానిక కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించి, ఆ పేదల జీవితాల్లో మునుపెన్నడూ లేని ఆనందాలు తెచ్చిన మన అందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయడం ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరం అని, అటువంటి మహోన్నత ఘట్టంలో భాగస్వామ్యం అవడం ప్రతి ఒక్క వైసిపి కార్యకర్తకు ఎంతో గర్వకారణం అని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని తమ క్యాడర్ కు సూచించారు. ఏలూరులోని 40వ డివిజన్లో  స్థానిక కార్పొరేటర్ తుమరాడ స్రవంతి ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్త రౌతు వెంకటేశ్వరరావు గృహంలో జరిగిన “వైసిపి కుటుంబాలతో ఆళ్ల నాని ఆత్మీయ సమావేశం”  కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసిపి పార్టీకోసం కృషి చేస్తున్న 40వ డివిజన్ లోని పలువురు నాయకులు, కార్యకర్తలతో ఆళ్ల నాని ముఖా ముఖి గా సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అవలంబించాల్సిన విధివిధానాలపై ఆళ్ల నాని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు అధినేతగా ఉన్న పార్టీలో సభ్యత్వం కలిగి ఉండడం ప్రతి ఒక్క కార్యకర్తకు ఎంతో గర్వకారణమైన విషయం అని, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా నిజాయితీతో కూడిన సంక్షేమ పాలనను అందిస్తూ, లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన తరుణం వచ్చేసిందని, ప్రతి ఒక్క కార్యకర్త మరొకసారి ప్రత్యేక చొరవ తీసుకుని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆళ్ల నాని సూచించారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలందించే  కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లవేళలా తిరిగి అండగా ఉంటుందని ఆళ్ళ నాని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను అదుపు చేస్తూ, 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిబిటి విధానం ద్వారా సంక్షేమ పాలనను ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు అందించి, అవినీతి లేని సమాజాన్ని సృష్టిస్తూ, మరోవైపు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి , గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడి పాలన కొనసాగించడంలో ప్రతి వైసీపీ కార్యకర్త భాగస్వామ్యం అవడం ద్వారా భావితరాలకు తమను తాము గర్వంగా చెప్పుకునే అవకాశం కార్యకర్తలకు దక్కుతుందని ఆళ్ల నాని సూచించారు. ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త రోజుకి 2గంటలు పార్టీ కోసం కేటాయించి తమ వీధిలో,తమ డివిజన్లలో జగన్  పరిపాలన దక్షత గురించి ఇంకా తెలియని వారు ఉంటే వారికి కూడా వెళ్లివివరించాలని కోరారు.ఈ సందర్బంగా స్థానిక కార్యకర్తలు మాట్లాడుతూ ఒకప్పుడు వరద వస్ట్ ఈ ప్రాంత ప్రజలు అంతా 12పంపుల స్కూల్ లోకి వెళ్లి ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ ఆశ్రయం పొందే వారమని, కానీ ఈరోజు నాని చేసిన తమ్మిలేరు రిటైనింగ్ వాల్ పనుల వల్ల ప్రశాంతంగా బ్రతుకుతున్నామని, రోడ్లు, డ్రెయిన్లు కూడా ఎన్నో అభివృద్ధి చేశారని, రాబోయే ఎన్నికల్లో అన్ని విధాలా ఆళ్ళ నానికి అండగా ఉంటాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిడేసి శ్రీనివాస్, నూకపేయ్యి సుదీర్ బాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, క్లస్టర్ 3 అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచెం మైబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సాసుపల్లి యుగంధర్, కోరాడ బాబు, వైసిపి నాయకులు సామంతుల లక్ష్మణ రావు, కంది రంగబాబు సహా  పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author