NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బదిలీపై ఏలూరు మున్సిపల్ అదనపు కమిషనర్ బాపిరాజు

1 min read

ఎక్కడ పనిచేసిన ఏలూరులో జ్ఞాపకాలను మరువలేను..

కమిషనర్ వెంకటకృష్ణ, నేను అన్నదమ్ములుగా కలిసిమెలిసి పనిచేశాం..

ఇంతకాలం కార్యాలయ సిబ్బంది సహకారం మరువలేను..

సిహెచ్ వివిఎస్ బాపిరాజు

డ్యూటీని,డ్యూటీల చేయాలన్నది బాపిరాజు నుండి నేర్చుకోవాలి..

ఐదేళ్లు ఒకే చోట పని చేయటం ఆశ్చర్యం, అభినందనీయం..

మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు నగలపార సంస్థలో ఐదు సంవత్సరాలపాటు అదనపు కమిషనర్ గా సేవలందించి ,బదిలీపై మచిలీపట్నం నగరపాల సంస్థకు కమిషనర్ గా  వెళుతున్న సిహెచ్ వి వి ఎస్ బాపిరాజుకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వీడ్కోల సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో పలు విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఆరోల సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మెప్మా సిబ్బంది,సచివాలయ సిబ్బంది పుష్ప గుచ్చాలు అందచి శాలువా కప్పి ఘనంగా సత్కరించి వీడ్కోలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసీనులైన వారిని ఉద్దేశించి బాపిరాజు మాట్లాడుతూ మీ అందరి సహకారంతో ఆదరాభిమానాలతో ఇoతకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సోదర భావంతో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇoతకాలం కలిసి మెలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఎక్కడ పనిచేసిన ఏలూరులో జ్ఞాపకాలను వీడలేనని గుర్తు చేసుకుంటానన్నారు. సిబ్బంది మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ హర్షద్దనాలతో వీడ్కోలు పలికారు.

About Author