PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024 ఇంటర్ ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయభేరి..

1 min read

క్రమశిక్షణతో కూడిన ఉత్తమ శిక్షణ, ఒత్తిడి లేని వ్యక్తిగత శ్రద్ధ విజయానికి కారణం

సిఈఓ వి తులసీరామ్

విజయానికి కారకులైన అధ్యాపక సిబ్బందికి అభినందనలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక నరసింహారావు పేట ఎన్ఆర్ఐ కాలేజ్ విద్యార్థులు విజయభేరి మొగించారని, ఈ సందర్భంగా  శుక్రవారం ఎన్ ఆర్ ఐ క్యాంపస్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈవో వి తులసీరామ్ మాట్లాడుతూ ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఏలూరు ఎన్నారై కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఎంపీసీ, బైపిసి, ఎంఈసి మరియు సిఇసి అన్ని విభాగాలలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని ఎన్నారై కళాశాలల సీఈవో వి తులసీరామ్ విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన విజయోత్సవ సభలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. అనంతరం విజయోత్సవ సభను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఒత్తిడి లేని వ్యక్తిగత శ్రద్ధతో ఉత్తమ శిక్షణ ద్వారా ఈ ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో 97.32 పాస్ పర్సంటేజ్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో 98.09 పాస్ పర్సంటేజ్ సాధించామని, అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు తెలియజేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె లాస్య శ్రీ 465, పి సత్యసాహితీ 464, ఎం డి అఫీషా 464, సిహెచ్ ప్రభాకర్ రావు 464, టి మేఘన 464,  పి మోక్షజ్ఞ 463, అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో ఎం మహిమ 987, సిహెచ్ ఎన్ సాయి దీక్షిత్ 983, జి సాయికృష్ణ 980, సీనియర్ బైపిసి విభాగంలో కెఎన్వి 989, జూనియర్ బైపిసి విభాగంలో యు హడస్సా 432, ఎం చార్మి 430, పి అభిరమ్యశ్రీ 430, జూనియర్ ఎంఇసి విభాగంలో ఎస్ ఎస్ రక్షిత 484, జూనియర్ సిఇసి విభాగంలో ఎస్.కె ఆసియా 474, సీనియర్ ఎoఇసి విభాగంలో ఎం గాయత్రి 974, సీనియర్ సిఇసి విభాగంలో జై పద్మజ 936 సాధించారని తెలిపారు. ఈ విజయానికి కార్యకులైన అధ్యాపక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల మున్సిపల్స్ వి కనకరత్నం, ఇ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author