ఆ అధికారం ఎమ్మార్వోలకు లేదు : హైకోర్టు
1 min readపల్లెవెలుగువెబ్ : రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల జాబితాను తయారు చేసి సబ్ రిజిస్ట్రార్‌లకు పంపే అధికారం తహసీల్దార్‌లకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 2007లో మారదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ ప్రకా రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్థిర ఆస్తుల వివరాలతో రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల జాబితాను సబ్ రిజిస్ట్రార్లకు పంపించే అధికారం జిల్లా కలెక్టర్లకే ఉందని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్ష న్ 22(ఏ)(1)(ఏ),(బీ) కింద ఉండి జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చిన రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల వివరాలను మాత్రమే సబ్ రిజిస్ట్రార్ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వివిధ ప్రభుత్వశాఖల అధికారుల నుంచి నేరుగా వచ్చిన జాబితాకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది.