NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతీయ యువజన రైతు పార్టీ ఆవిర్భావం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నూతన సరికొత్త జాతీయ రాజకీయ పార్టీగా “భారతీయ యువజన రైతు పార్టీ”ఆవిర్భవించింది అని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మోరాపిచ్చిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ కు అభినందనలు తెలియజేశారు ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందువల్ల బి. వై. ఆర్ .పార్టీ అన్ని విషయాలలో ఉద్యమిస్తుందని పెరుగుతున్న నిత్య అవసర వస్తువుల ధరలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవడంలేదని, మా పార్టీ తెలుగు రెండు రాష్ట్రాలలో రానున్న ఎన్నికలలో అన్ని చోట్ల పోటీ చేస్తుందని పార్టీ గుర్తు, పార్టీజెండా త్వరలోనే తెలియజేస్తామని అన్నారు అనంతరం పార్టీ నాయకులు జయ కుమార్ గుప్తా మాట్లాడుతూ మాపార్టీ 5 రాష్ట్రాలు లో పోటీ చేస్తుందని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని గ్రామస్థాయిలో రాష్ట్రస్థాయిలో కార్యచరణ మొదలు పెడుతున్నామని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author