ధర్నాకు వెళ్ళనున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సమస్యల పరిష్కారం కొరకు ధర్నాకు వెళ్తున్నామని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 18 న జిల్లా కలెక్టరేట్ల మరియు జనవరి 5వ తేదీన ఛ లో విజయవాడ ధర్నాకు వెళ్తున్నట్లు ఈ రెండు రోజులు విధులకు హాజరు కాలేమని వారు ఎంపీడీవోకు వివరించారు.ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ఉద్యోగ భద్రత,మ్యాండేస్ విధానం రద్దు,3 సంవత్సరాలు పూర్తి అయిన ఎఫ్ఎ లందరికీ ఎఫ్ టిఈ అమలు చేయాలని,అర్హత ఉన్న ఎఫ్ఎ లకు పదోన్నతులు ఇవ్వాలని, ప్రమాదవ శాత్తు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఈ సమస్యలు పరిష్కారం కొరకు రాష్ట్ర యూనియన్ కమిటీ పిలుపు మేరకు ధర్నాకు వెళ్తున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూనియన్ అధ్యక్షులు మధు,స్వాములు,ఆలిమ్ భాష,మర్రి రామేశ్వరుడు,నాగరాజు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.