ఉపాధి కూలీలు… పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలి
1 min read– ఏపీవో వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు, పత్తికొండ: జాబు కార్డు ఉన్న ప్రతి ఉపాధి కూలీ 100 రోజుల పని దినాలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో వెంకటేశ్వర్లు సూచించారు.పత్తికొండ మండల పరిధిలోని చందోలి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పథకం ఏపీవో వెంకటేశ్వర్లుపర్యటించారు. ఈ సందర్భంగా చందోలి గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్ళి వారితో కలియ తిరుగుతూ, కూలీలు ఏ విధంగా పనిచేసుకుంటే ఎక్కువ కూలి వస్తుందనే అంశాలను కూలీలకు తెలియజేశారు. అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఆర్టికల్చర్ కింద మామిడి, సీనా, జామ, సపోటా, సీతాఫలము, మల్లెపూలు చెట్లు మొదలగునవి నాటుకోవాలని తెలిపారు. గ్రామంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ సీనియర్ మేటి ల పని విధానం గురించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. త్వరలో ప్రతి గ్రామంలో గ్రామస్తులతో మీటింగ్ కా ర్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జయరాముడు మేటి లు పాల్గొనడం జరిగింది.