ఉద్యోగులపై దాడి చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలి
1 min readమున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లికార్జున
పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని 29 వ వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శి ఆకుల అశోక్ పై దాడిని ఖండిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగుల సంఘం (APMMEA)రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఆధ్వర్యంలో,ఉద్యోగులు,సచివాలయ సిబ్బంది మధ్యాహ్న భోజన విరామ సమయం లో నిరసన తెలిపి,సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుపై దాడులు చేసే వారి ని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకొని రావాలని కోరారు.నిత్యం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం లో తమ వంతు కృషి చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతము కాకుండా దాడికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వెలగపూడి సెకరెట్రియేట్ లో మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరితో జరిగే సమావేశం లో సచివాలయ ఉద్యోగి పై దాడి విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్లు తెలిపారు.