ఉద్యోగులు మోసం చేస్తున్నారు : విప్రో చైర్మన్
1 min readపల్లెవెలుగువెబ్ : టెక్ రంగంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్స్ చేస్తున్న వైనంపై దిగ్గజ ఐటీ సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారు సంస్థలను మోసం చేస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. శనివారం ట్విటర్ వేదికగా రిషద్ స్పందించారు. ‘‘టెక్ రంగంలో కొందరు మూన్‌లైటింగ్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మోసమే’’ అని రిషద్ ట్వీట్ చేశారు. ఒక ఉద్యోగి రెండు జాబ్స్ చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. స్విగ్గీ ఇటీవలే.. కొన్ని పరిమితులకు లోబడి మూన్‌లైటింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రిషద్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.