PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులు సంఘటితంగా ఉంటే హక్కులు సాధించుకోవచ్చు

1 min read

– ఎస్ఇ కానుగుల శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానికఏలూరు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో సుపరిండెండెట్ ఇంజినీర్ కానుగుల శ్రీనివాస్ మరియు సర్కిల్ సిబ్బంది ఆధ్వర్యంలో చిరు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చని ఎస్ ఇ శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు గా మరియు ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన చోడగిరి శ్రీనివాస్, నోరి శ్రీనివాస్ లను అదే విధముగా ఏలూరు తాలూకా మహిళా సంయుక్త కార్యదర్శి గా ఎన్నికైన ఎలుబూడి సత్య భారతి ని సన్మానించిన సందర్భంగా స్థానిక సూపరిo డెంట్ ఇంజనీరింగ్ కార్యాలయంలో వారిని గజమాలతో, పూల బొకే అందించి శాలువా కప్పి గన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలియజేసి పాల్గొన్నారు.

About Author