NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి:ఆపస్

1 min read

ఒంగోలు, పల్లెవెలుగు:సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఇతర డాటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి వారికి తగు మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.శ్రావణ కుమార్ అన్నారు ఒంగోలులోని మండల రిసోర్స్ సెంటర్ నందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల పెన్డౌన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వారికి టైం స్కేల్ ఇవ్వడంతో పాటు 62 సంవత్సరాల పదవి విరమణ ఉత్తర్వులు అమలు పరచాలని,చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా అన్ని రకాల సెలవులు ఇవ్వాలని వారు వినతిపత్రంలో  కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులతో పాటు సమగ్ర శిక్ష జేఏసినాయకులు నరేష్, ఏడుకొండలు, జ్యోతి, కల్పన, సునీత, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author