PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగస్తులు

1 min read

– నోడల్ అధికారి టీ నాగరాజునాయుడు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 38 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనినోడల్ అధికారి టీ నాగరాజునాయుడు. తెలియజేశారు.శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగ సౌలభ్య కేంద్రంలోఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కువినియోగించుకున్నారు.నోడల్ అధికారి నాగరాజు నాయుడు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం -12 ద్వారా 68 మంది దరఖాస్తు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పొందారని, అందులో 38 మంది ఈరోజు సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ వినియోగ సౌలభ్య కేంద్రం ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 30 మందికి పోస్టల్ ద్వారా బ్యాలెట్ పంపడం జరిగిందని, వీరు పోస్టల్ బ్యాలెట్ ను పోస్టల్ ద్వారా గాని నేరుగా గాని ఈనెల 15వ తారీఖునాటికి అనంతపురం ఆర్వో కార్యాలయానికి చేర్చాలని నోడల్ అధికారితెలియజేశారు.

About Author