పాలకమండలి తీర్మానంపై ఉద్యోగుల ఆశ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : మహానంది దేవస్థానం తీర్మానంపై ఆలయంలో పనిచేసే ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పిఆర్సి విధానం అమలులోకి తెచ్చింది. అందులో భాగంగానే మహానంది దేవస్థానం వారు పిఆర్సికి ఆమోదముద్ర వేశారు. కానీ పిఆర్సి అరియర్స్( బకాయిలు) మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. చేస్తామని ప్రకటిస్తున్న ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదు. కోటి ఆశలు పెట్టుకున్నా ఉద్యోగులు వినాయక చవితి సందర్భంగా పాత బకాయిలు విడుదల అవుతాయని ఎదురు చూశారు. విడుదల కాలేదు. నేడు మహానంది మండల పాలకమండలి సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనైనా తీర్మానం చేసి దసరా లోపు బకాయిలు విడుదల చేస్తారా లేక నాన్చుడు ధోరణి అవలంబిస్తారా అనేది తేలాల్సి ఉంది. మహానంది దేవస్థానం అర్చకుల తరఫున ఒక బోర్డు మెంబర్ ఉన్న దీనిపై సమావేశంలో ప్రశ్నిస్తారా నాకెందుకులే అని వదిలేస్తారా వేసి చూడాల్సి ఉంది. పాలకమండలి సమావేశంలో మీడియాకు మాత్రం అనుమతి ఇవ్వరు. రహస్యంగానే సమావేశం నిర్వహించడం గత ఏడాది నర నుంచి నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. గతంలో మీడియాను అనుమతించేవారు. ఇక్కడ అంతా గోప్యమే.