ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి : జెడ్పీ చైర్మన్ కౌరు
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు బుధవారం చైర్మన్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి.. గజమాలతో ఘనంగా సత్కరించారు. చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉద్యోగులంతా ఐక్యతతో బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని, జడ్పీ కార్యాలయానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరించాలని ,జిల్లా నలుమూలల నుండి కార్యాలయానికి వచ్చే ప్రజలకు తోటి సహోద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమన్వయంతో వ్యవహరించి వారి వారి పనులను పూర్తి చేసి వారిని సంతోషంగాపంపాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి సాధ్యమైనంతవరకు అందజేస్తానని హామీ ఇచ్చారు. సమయపాలన పాటించడం,ప్రజలకు చేరువగా సేవలు అందించడం కొనసాగించి లక్ష్యాలను అధిగమించడంలో కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోర్నిరు శ్రీధర్ రాజు,సిహెచ్ గోపాలకృష్ణలను సంఘ కార్యక్రమాలను మరింత అభివృద్ధి పరచడంలో వారి కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో హరిహరనాథ్,జిల్లా కోశాధికారి కనకరాజు,చౌదరి, జి వెంకటేశ్వరరావు, ఎన్ పణిశంకర్, ప్రకాష్,సాయిరాం మరియు కార్యాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.