ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి ఉద్యోగులు
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు వెల్లడించారు. పీఆర్సీ పోరాట కార్యాచరణ పై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈనెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.