జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ వార్షిక సమావేశం
1 min read
ఘనంగా వజ్రోత్సవ వసంతాల వేడుక
75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 15 మంది సంఘ సభ్యులకు సత్కారం
శాలువా కప్పి,పూలదండలు వేసి జ్ఞాపికలు అందజేసి సత్కరించిన సంఘ సభ్యులు
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సమావేశం మరియు 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సంఘ సభ్యులు సత్కార సభను శుక్రవారం ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందుల వీరభద్రరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా వై నరసింహారావు విశ్రాంత సూపరీంటెండెంట్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ఎం శేఖర్ బాబు విచ్చేశారు. 75 వసంతాలు పూర్తయిన సభ్యులకు ఆత్మీయ సత్కార వేడుక. వేదిక పై నిర్వహించారు. సన్మాన గ్రహీతలు వై నరసింహారావు, వై వేళాంగిణి, ఎన్ ప్రజారాజ్యం, ఎస్ వి వి సూర్యనారాయణ, ఎంఎ రజాక్ ,ఎస్ శకుంతలమ్మ, వెలగా వీరయ్య ,ఏ ఆశీర్వాదం తో 75 వసంతాలు పూర్తి చేసుకున్న 15 మందికి సభ్యులకు శాలువాలు కప్పి, పూలదండలువేసి జ్ఞాపకాలు అందజేశారు. వారికి తోటి సంఘ సభ్యులు, ఆత్మీయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో సంఘ ప్రధాన కార్యదర్శి తానేటి భాస్కర్ కుమార్ ఉపాధ్యక్షులు ఎన్ వి రామారావు కోశాధికారి కొఠరు మల్లికార్జునరావు మరియు సభ్యులు దండు వెంకట సుబ్బారాజు, గద్దె సత్యనారాయణ,కె సూర్యచంద్రం, కె వెంకటరావు, మంతెన సుబ్బరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ నారాయణ తదితర విశ్రాంత సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.