నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగులు
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ చీఫ్ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఉద్యోగులకు సర్దిచెప్పేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇవాళ కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం సర్దిచెప్తున్నప్పటికీ ఉద్యోగులు పోరుబాట పట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లను పూర్తీ స్థాయిలో నెరవేర్చితే తప్ప ఉద్యమ బాట వదలమని తెలిపారు.