ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్న ఉద్యోగులు !
1 min readపల్లెవెలుగువెబ్: సీపీఎస్ ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు. సీపీఎస్ రద్దు చేస్తామంటూ ఇచ్చిన మాటపై జగన్ సర్కార్ మడమ తిప్పేయడంతో రెండు సంఘాలు ఉద్యమ కార్యాచరణ చేపట్టాయి. సీపీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సెప్టెంబరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ రెండు సంఘాలు వేరు వేరుగా ఆందోళనలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం జగన్ ఇల్లు ముట్టడికి పిలుపు ఇవ్వగా… సీపీఎస్ రద్దుపై పోరాటం చేస్తున్న మరో ఉద్యోగుల సంఘం ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అదే రోజు విజయవాడలో మిలీనియం మార్చ్‌కు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.