జగనన్న పథకాలతో.. మహిళా లోకానికి ఉపాధి లభ్యం
1 min readమహిళకు పెద్దపీట వైసీపీతోనే సాధ్యం : ఎమ్మిగనూరు సమన్వయకర్త : శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల కేంద్రంలోని జరిగిన నవరత్నాలు అమలులో భాగంగా – నాలుగవ విడత ఆసరా కార్యక్రమంలో స్థానిక ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , ఎమ్మిగనూరు వైస్సార్సీపీ సమన్వయకర్త శ్రీమతి.బుట్టా రేణుక ల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నవరత్నాలు అమలులో భాగంగా 11-04-2019 నాటికి స్వయం సహాయక సంఘాల యొక్క బ్యాంకు లింకేజీ అప్పు నిలువను వైయస్సార్ ఆసరా పథకం ద్వారా తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. నందవరం మండలంలో 11-04-2019 నాటికి బ్యాంకు లింకేజీ అప్పు నిలువ ఉన్న స్వయం సహాయక సంఘాలు 648 సభ్యులు 6,480 మంది మొత్తము 10 కోట్ల 40 లక్షల రూపాయలు ఈ మొత్తము నాలుగు విడతలగా స్వయం సహాయక సంఘం ఖాతాలో జమ చేయడం జరుగుతున్నది. ఇప్పటికే మూడు విడతలలో 648 స్వయం సహాయక సంఘాలు 6480 మంది సభ్యులకు మొత్తము 7 కోట్ల 80 లక్షల రూపాయలు సహాయక సంఘాల ఖాతాలో జమ చేయడం జరిగినది ప్రస్తుతము చివరి మరియు నాలుగవ విడత గా గౌరవ ముఖ్యమంత్రి 23-01-2024 న ఈ వై యస్ ఆర్ ఆసరా కార్యక్రమమును ప్రారంభించడం జరిగినది.మన నందవరం మండలంలో ఈరోజు అనగా 17-02-2024వ తేదీన 648 స్వయం సహాయక సంఘాల ఖాతాలకు 2 కోట్ల 60 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుచున్నది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నందవరం మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్, జిల్లా కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు విరూపాక్షి రెడ్డి, జడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి, కో ఆప్షన్ మెంబెర్ షేక్ మహమ్మద్, మండల జేసియస్ కన్వీనర్ చాంద్ బాషా, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు నందవరం మండల అధికారులు తహశీల్దార్, ఎంపీడీఓ,డియర్ డిఓ పీడీ, డియర్ డిఓ ఎపిఎం తదితరులు పాల్గొన్నారు.