ఈనెల 12న ఉపాధి మహాధర్నా..
1 min read
ఇంటి నిర్మాణాలకు 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ఈనెల 12వ తేదీన విజయవాడలో జరిగే ఉపాధి మహా ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు ఉపాధి హామీ పథకం ఏపీవో భూపన జయంతికి ఉపాధి కూలీల సమస్యలు మహా ధర్నా పాంప్లెట్ ను వ్య.కా.సం నాయకులు ఓబులేష్, లింగస్వామి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ధర్నా చౌక్ లో 12వ తేదీ ఉ 10 గం.కు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఈ ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.100 రోజులు ఉపాధి పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా పని దినాలు కల్పించాలని ఎండాకాలం అలవెన్స్,పే స్లిప్స్, పెండింగ్ ఉపాధి బిల్లులను ఇవ్వాలని, ఉపాధి పని చేస్తూ మరణించిన కుటుంబాలకు 25 లక్షలు రెండు ఎకరాల భూమి,పేద కుటుంబాలకు ఏడాదికి 12వేలు మూడు సెంట్ల స్థలం,ఇండ్లు నూతనంగా నిర్మించుకునే వారికి ఆరు లక్షలు ఇవ్వాలని దళిత కాలనీలకు రెండు ఎకరాల స్మశాన స్థలం ఉపాధి మేట్లకు 5 రూపాయలు పారితోషికం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.